గాడ్ ఫాదర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను తీసుకుంటున్నారు అంటూ, అలాగే ఇందులో ఒక పాట కోసం బాలీవుడ్ స్టార్ సింగర్ బ్రిట్నీ స్పియర్ ను కూడా సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలన్ని నిజమే అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు.

- Advertisement -

ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో థమన్ మాట్లాడుతూ..చిరంజీవి ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు అని వినిపిస్తున్న వార్త నిజమే. ఈ సినిమాలో చిరంజీవి తో కలసి సల్మాన్ ఖాన్ స్టెప్పులు వేయనున్నాడు. పాట కూడా వారిద్దరి స్థాయికి తగ్గట్టుగా ఉండాలని బాలీవుడ్ సింగర్ బ్రిట్నీ స్పియర్ ని రంగంలోకి దించినట్లు తెలిపాడు. ఆమెతో తెలుగు పాట పాడించాలా? లేక ఇంగ్లీష్ ట్రాక్ పాడించాలా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు అని తెలిపాడు తమన్.

Share post:

Popular