పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ స్వామిజీ.. ఎవరంటే?

November 12, 2021 at 12:16 pm

కన్నడ స్టార్ పునీత్ అకాల మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికీ అతని మరణవార్తను అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన మరణవార్త విని ఇప్పటికే కొందరు గుండెపోటుతో మరణించగా మరికొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఇది ఇలా ఉంటే చిత్రదుర్గ మురుఘ రాజేంద్ర గృహ మఠం డాక్టర్ శివ మూర్తి మురుఘ గురువారం బెంగళూరులోని పునీత్ రాజ్ కుమార్ నివాసానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పునీత్ మరణం తరువాత ఆయనకు బసవ శ్రీ ప్రశస్తిని ప్రకటించారు. ప్రశస్తిని స్వీకరించడానికి పునీత్ భార్య అశ్విని రావాలని ఆమెను ఆహ్వానించారు. ఇక పునీత్ పుణ్య స్మరణగా టీ నరసిపుర తాలూకా బసవన్నహళ్లిలో అభిమానులు, అలాగే గ్రామస్తులు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారుగా రెండు వేల మందికి మాంసాహారం తో కూడిన భోజనాన్ని వడ్డించారు. ఈ క్రమంలోనే మంచే గౌడ అనే అభిమాని గుండు చేయించుకుని మరీ పునీత్ కు నివాళులు అర్పించారు.

పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ స్వామిజీ.. ఎవరంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts