చిరుకు నై, బాల‌య్య‌కు సై అన్న ఆ స్టార్ హీరో కూతురు..!

బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌`ను పూర్తి చేసుకున్న బాల‌య్య‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌బోతోంది.

- Advertisement -

Gopichand Malineni To Direct Balakrishna Under The Mythri Movie Makers Banner - Telugu Nandamuri Director Mov-TeluguStop

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌దానిపై స‌స్పెన్స్ నెల‌కొన‌గా.. మేక‌ర్స్ ఇప్పుడా స‌స్పెన్స్‌కు తెర దించారు. ఈ చిత్రంలో స్టార్ హీరో కూతురు, ప్ర‌ముఖ హీరోయిన్ శ్రుతిహాస‌న్ బాల‌య్య‌కు జోడీగా న‌టించ‌బోతోంద‌ని తాజాగా ఓ పోస్ట‌ర్ ద్వారా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Image

అయితే చిరంజీవి, డైరెక్ట‌ర్ బాబీ కాంబోలో తెర‌కెక్క‌బోయే మాస్ ఎంటర్ టైనర్ చిత్రంలోనూ శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా ఫిక్స్ అయిన‌ట్టు ఈ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. కానీ, తాజా స‌మ‌చారం ప్ర‌కారం.. శ్రుతి చిరంజీవి సినిమాకు నై చెప్పి, బాల‌య్య మూవీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని తెలుస్తోంది.

Share post:

Popular