ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. దీనమ్మ జీవితం.. ఇలాంటి ట్రైలర్ చూస్తే ఒట్టు!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందా అని యావత్ సినీ లోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, లిరికల్ సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులు అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ ఫ్యాన్ మేడ్ ట్రైలర్‌లో ఆర్ఆర్ఆర్ సీన్స్‌ను తీసుకుని వాటికి తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా తమిళ డబ్బింగ్ చిత్రం ‘ఎనిమీ’ వాయిస్‌ను మిక్స్ చేయడంతో ఈ ట్రైలర్ నిజంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోనిదా అని అందరికీ అనిపిస్తోంది.

ఏదేమైనా ఇలా రోజురోజుకూ ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఏ రేంజ్‌లో పెరుగుతూ వెళ్తుందో ఇట్టే చెప్పేయొచ్చు. ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామారాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ భామ ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందదిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Share post:

Popular