18 పేజీస్ రిలీజ్ డేట్.. అదే లక్కీ అంటోన్న చిత్ర యూనిట్

November 11, 2021 at 11:09 pm

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సొంత ప్రొడక్షన్ హౌజ్ ‘సుకుమార్ రైటింగ్స్’ పేరుతో ఇప్పటికే పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. కాగా ఈ నిర్మాణ సంస్థ ప్రెజెంట్ చేస్తున్న సరికొత్త చిత్రం ‘18 పేజీస్’ ఇప్పటికే షూటింగ్ పనలను శరవేగంగా జరుపుకంటోంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సుకుమార్ రచించడంతో ఈ సినిమా డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ అంతే రొమాంటిక్‌గా తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కేవలం పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్‌ను కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ కావడంతో ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ సినిమాను ఫిబ్రవరి 18న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

18 పేజీస్ రిలీజ్ డేట్.. అదే లక్కీ అంటోన్న చిత్ర యూనిట్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts