ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌..న‌వంబ‌ర్‌ 10న ఆ అప్డేట్ ఖాయ‌మ‌ట‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఇటలీ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ ప్రేమకథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్, టి సిరీస్ బ్యాన‌ర్లపై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Radhe Shyam Poster: Makers of Radhe Shyam unveil new poster on the occasion of Janmashtami

అలాగే ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ షురూ చేశారు. అయితే తాజాగా ఈ సినిమాపై ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే ఓ గుడ్‌న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. రాధేశ్యామ్ ఫ‌స్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. న‌వంబ‌ర్ 10న ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను విడుద‌ల చేయ‌నున్నార‌ని, దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని తెలుస్తోంది. కాగా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నాడు.