బాల‌య్య టాక్ షోలో సెకెండ్ గెస్ట్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్ర‌సారం అవుతోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అవ్వ‌డ‌గా.. మొట్టమొద‌ట‌ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు స్పెష‌ల్‌గా గెస్ట్‌లుగా విచ్చేశారు.

Image

దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న ప్ర‌సార‌మైన ఈ ఎపిసోడ్ దాదాపు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలోనే సెకెండ్ ఎపిసోడ్ గెస్ట్ ఎవ‌రు..? బాల‌య్య ఎవ‌రిని ఇంట‌ర్వ్యూ చేయ‌బోతున్నారు..? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మార‌గా.. ఆహా టీమ్ తాజాగా ఈ విష‌యంలో ఓ క్లారిటీ ఇచ్చేసింది.

Image

బాల‌య్య టాక్ షోలో సెకెండ్ ఎపిసోడ్ గెస్ట్‌గా న్యాచుర‌ల్ నాని రాబోతున్నాడు. `మ‌న‌లో ఒక‌డు, సెల్ఫ్ మేడ్‌కి స‌ర్ నేమ్.. మ‌న రెండో గెస్ట్ నాని` అని తెలుపుతూ ఆహా కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. అంతేకాదు, ఈ రోజు సాయంత్రం 5.04 గంట‌ల‌కు రెండో ఎపిసోడ్ ప్రోమో విడుద‌ల అవుతుంద‌ని ఆహా త‌మ అధికారిక ట్విట్ట‌ర్‌లో పేర్కొంది.

Image

Image

 

Share post:

Latest