`అనుభవించు రాజా` అంటున్న నాగ్‌..మ్యాట‌రేంటంటే?

November 16, 2021 at 7:31 pm

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ త‌రుణ్ తాజా చిత్రం `అనుభ‌వించు రాజా`. శ్రీను గవిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కశిష్‌ ఖాన్ హీరోయిన్‌గా న‌టించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nagarjuna releases Raj Tarun's first-look from Anubhavinchu Raja | Telugu Movie News - Times of India

ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్రమోష‌న్స్ నిర్వ‌హిస్తున్న మూవీ మేక‌ర్స్‌.. వ‌రుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం కింగ్ నాగార్జున రంగంలోకి దిగుతున్నారు. అస‌లు మ్యాట‌రేంటంటే.. అనుభ‌వించు రాజా సినిమా ట్రైల‌ర్‌ను రేపు ఉదయం 10:08 నిమిషాలకు నాగార్జున త‌న చేతుల మీదుగా రిలీజ్ చేయ‌బోతున్నారు.

Image

మేక‌ర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. దీంతో ఈ సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ అయింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే వినోదాత్మక కథ ఇది. అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యాన‌ర్ల‌పై సుప్రియ యార్లగడ్డ ఈ మూవీని నిర్మించింది.

`అనుభవించు రాజా` అంటున్న నాగ్‌..మ్యాట‌రేంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts