జనాలు రమ్యకృష్ణ పై చెప్పులు విసరడానికి కారణం ఏమిటి..?

November 16, 2021 at 6:58 pm

రమ్యకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక గొప్ప లెజెండ్రీ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నరసింహ సినిమాలో నీలాంబరిగా , బాహుబలి సినిమాలో శివగామిగా ఎన్నో సినిమాలలో దేవత అవతారంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. 1992 నుండి 2002 వరకు ఎన్నో భాషలలో.. ఎన్నో సినిమాలలో నటించి టాప్ హీరోయిన్ గా మారి, తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది.. తాజాగా తన కెరియర్ లో జరిగిన ఒక బాధాకరమైన ఘటనను ప్రేక్షకులతో పంచుకుంది..

ఇకపోతే నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర చేసి ఎంతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ , రజినీకాంత్ తో పోటీపడి మరీ నటించింది. రజనీకాంత్ పక్కన హీరోయిన్ గా కాకుండా నెగటివ్ రోల్ చేసి సంచలనం సృష్టించింది.. ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన సౌందర్య పాత్ర తనకు వచ్చి ఉంటే చాలా బాగుండేది అని తను చాలా సార్లు అనుకున్నదట. కానీ ఎలాగోలా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు వెల్లడించింది.. షో విడుదలైన మొదటి రోజు తన చెల్లి సినిమా చూడడానికి థియేటర్ కు వెళ్ళిందట. కానీ అక్కడ తెరమీద రమ్యకృష్ణ కనిపించగానే చెప్పులు విసిరారట.

తన చెల్లి ఆ విషయం చెప్పగానే ఎంతో బాధపడింది అట. కానీ చివరకు ఈ పాత్ర వల్ల తనకు మంచి పేరు రావడంతో చాలా సంతోషం వేసింది అని రమ్యకృష్ణ తెలిపింది.

జనాలు రమ్యకృష్ణ పై చెప్పులు విసరడానికి కారణం ఏమిటి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts