సినిమాను తలపిస్తున్న త్రివిక్రమ్ పెళ్ళి స్టోరీ..!!

November 16, 2021 at 6:44 pm

మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రచయిత అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..ఈయన తన దర్శకత్వంలో ఎన్నో సినిమాలను తెరకెక్కించి ఎంతో మంది హీరోలకు మంచి లైఫ్ ఇచ్చారు.. చాలా మంది ప్రస్తుతం ఆయనతో సినిమాలు తీయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే , ఆయన పెళ్ళి స్టోరీ ఒక సినిమాను తలపిస్తుందట. ప్రస్తుతం ఈయన పెళ్లి విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన త్రివిక్రమ్.. కొంతకాలం పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి, ఆ తర్వాత కమెడియన్ సునీల్ తో మంచి అనుబంధం పెంచుకున్నాడు.ఇక మొదటిసారి 1998వ సంవత్సరంలో స్వయంకృషి సినిమాకు మాటలు రాశారు.. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలకు ఈయన రాసే డైలాగులు, పంచులు జనాలకు బాగా నచ్చడంతో , తక్కువ కాలంలోనే మాటల మాంత్రికుడు గా గుర్తింపు తెచ్చుకున్నారు..

ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే , ఈయన భార్య పేరు సౌజన్య.. ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మేనకోడలు.. సౌజన్య వాళ్ళ అక్కను పెళ్లి చూపులకు చూడడానికి వెళ్ళాడు కానీ తనకు సౌజన్య బాగా నచ్చడంతో ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు చెప్పాడట. కానీ సౌజన్య అక్క పెళ్లి చేసే వరకు ఆగాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో , ఇక ఆమె అక్క పెళ్లి జరిగే వరకు ఆగి, త్రివిక్రమ్ 2002లో సౌజన్యను వివాహం చేసుకున్నారు.

సినిమాను తలపిస్తున్న త్రివిక్రమ్ పెళ్ళి స్టోరీ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts