మెహ్రీన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్సులు కొట్టేస్తూ దూసుకుపోతోంది.
ప్రస్తుతం సంతోష్ శోభన్ సరసన ఈమె నటించిన `మంచి రోజులు వచ్చాయి` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు ఎఫ్3లో వరుణ్ తేజ్‌కు జోడీగానూ మెహ్రీన్ నటిస్తోంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం ఈమె చేతుల్లో ఉన్నాయి.
ఇక ఇన్నాళ్లూ బొద్దుగా కనిపించి అలరించిన మెహ్రీన్.. ఈ మధ్య నాజూగ్గా మారి సోషల్ మీడియాలో హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా కూడా చిట్టి పొట్టి బట్టలు ధరించి హాట్ లుక్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కించేసింది. ప్రస్తుతం మైండ్‌బ్లాక్ చేస్తున్న మెహ్రీన్ తాజా పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.