`ఆర్ఆర్ఆర్‌` కోసం వెన‌క్కి త‌గ్గిన ఆలియా భ‌ట్‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

RRR | Full Movie HD Facts 4K | NTR | Ram Charan | Ajay D | Alia Bhatt | Olivia Morris | SS Rajamouli - YouTube

అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 7న విడుద‌ల కానుంది. పాన్ ఇండియా మూవీ కావ‌డం, అంచ‌నాలు భారీగా ఉండ‌టంతో.. సంక్రాంతి బ‌రిలో ఉన్న మిగ‌తా సినిమాల‌న్నీ వాయిదా ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆర్ఆర్ఆర్ కోసం ఆలియా భ‌ట్ సైతం వెన‌క్కి త‌గ్గింది.

Sanjay Leela Bhansali's 'Gangubai Kathiawadi' starring Alia Bhatt postponed again to avert clash with SS Rajamouli's 'RRR' | Hindi Movie News - Times of India

అవును, తాను న‌టించిన ఆర్ఆర్ఆర్ కోసం, త‌న `గంగూబాయి కథియావాడి` చిత్రాన్ని వాయిదా వేసుకుందామె. సంజయ్‌లీలా భన్సాలీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీని జనవరి 6న హిందీతో పాటుగా తెలుగులోనూ విడుదల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, అనూహ్యంగా ఆర్ఆర్ఆర్ లైన్‌లోకి వ‌చ్చింది. రెండు భారీ బడ్జెట్‌ సినిమాలు ఒకరోజు గ్యాప్‌లో విడుదలైతే అది కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ కార‌ణంగానే గంగూబాయి కథియావాడి చిత్రాన్ని ఫిబ్రవరి 18కు వాయిదా వేస్తున్న‌ట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.