అమెజాన్ ప్రైమ్‌లో `దృశ్యం 2`..అదిరిపోయిన టీజ‌ర్‌!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `దృశ్యం 2`. జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రం గ‌తంలో విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న `దృశ్యం`కు సీక్వెల్‌గా రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

Drushyam 2 Teaser: Daggubati Venkatesh, Meena's Telugu Thriller Film to Arrive on Amazon Prime Video on November 25 (Watch Video) | ? LatestLY

అయితే ఆ ప్ర‌చారాన్ని నిజం చేస్తూ తాజాగా మేక‌ర్స్ ఓ సూప‌ర్ అప్డేట్ ఇచ్చారు. దృశ్యం 2ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలుపుతూ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. దృశ్యం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే దృశ్యం 2 సినిమా స్టార్ అవుతుంద‌ని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.

Drushyam 2 Teaser OUT: Venkatesh Daggubati starrer looks every bit intriguing; To release on November 25 | PINKVILLA

`రాంబాబు కేసు ఏమైంది సార్` అని అడగడంతో ప్రారంభమైన ఈ టీజర్.. ఆధ్యంతం ఆక‌ట్టుకుంది. `ఆ చీకటి జ్ఞాపకాల్లోకి మళ్ళీ మమ్మల్ని లాగొద్ద`ని వెంకటేష్ బ్రతిమాలుతుండటం.. ఎప్పటిలాగే పోలీసులు అతన్ని తమ శైలిలో ఇన్వెస్టిగేషన్ చేయడాన్ని టీజ‌ర్ లో చూపించారు. మొత్తానికి అదిరిపోయిన ఈ టీజ‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి ఈ సారి రాంబాబు పోలీసుల బారి నుంచి త‌న ఫ్యామిలీని ఎలా కాపాడ‌తాడు అన్న‌ది తెలియాలంటే న‌వంబ‌ర్ 25 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest