బాల‌య్య‌ యాడ్స్‌లో నటించకపోవడానికి అస‌లైన రీజ‌న్ ఏంటో తెలుసా?

సాధార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోలైనా, హీరోయిన్లైనా మంచి క్రేజ్ వ‌చ్చిన త‌ర్వాత యాడ్స్‌లో న‌టించి కోట్ల‌ను వెన‌కేసుకుంటుంటారు. అయితే బోలెడంత క్రేజ్ ఉండి కూడా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క యాడ్‌లో నటించని వాళ్లూ ఉన్నారు. ఈ లిస్ట్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌ ముందుంటారు.

Unstoppable first episode promo: Mohan Babu opens up on his struggling period as an actor with Nandamuri Balakrishna | Entertainment News,The Indian Express

సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య‌.. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక జానపద, పౌరాణిక, సాంఘిక సినిమాలలో నటించిన ఒకే ఒక్క హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అటువంటి వ్య‌క్తి ఇప్పటి వరకు ఒక్క యాడ్‌ కూడా చేయలేదు. ఆయ‌న తోటి హీరోలంద‌రూ ఓవైపు సినిమాలు, మ‌రోవైపు యాడ్స్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు.

Balakrishna and Pragya Jaiswal starrer Akhanda's teaser clocks 50M views | Telugu Movie News - Times of India

కానీ, బాల‌య్య మాత్రం ఎన్ని ఆఫర్లు వ‌చ్చినా యాడ్స్‌కి నో అనే చెప్పేవారు. అయితే అందుకో కారణం ఉందంటున్నాడు బాలయ్య. `తమకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది ప్రజలేనని.. వాళ్లని మెప్పించేలా సినిమాలు చేయగలగాలి కానీ.. వాళ్ళు ఇచ్చిన ప్రేమను వ్యాపారంగా చేసుకోవడం తగదు. ఇక తన తండ్రి పెద్ద నటుడు అయినప్పటికీ ఆయ‌న ఏనాడూ యాడ్స్ లో చేయలేదు. ఆయ‌న బాట‌లోనే నేను న‌డుస్తా` అంటూ గతంలో బాల‌య్య ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Share post:

Latest