డిసెంబర్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నున్న సినిమాలు ఇవే!

క‌రోనా ప‌రిస్థితులు సద్దుమనగడంతో సినిమాల‌న్నీ వ‌రుస బెట్టి విడుద‌ల‌ అవుతున్నాయి. ఇక ఈ డిసెంబ‌ర్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసేందుకు భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మ‌రి ఆ సినిమాలేంటో ఓ లుక్కేసేయండి.

Ghani's first look revealed: Varun Tej plays a boxer in the Kiran Korapatti's directorial | Telugu Movie News - Times of India

గ‌ని: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంట‌గా న‌టించిన చిత్ర‌మే గ‌ని. కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ 3న థియేట‌ర్స్‌తో విడుద‌ల కాబోతోంది.

Allu Arjun reveals Pushpa release date | Entertainment News,The Indian Express

పుష్ప: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను పుష్ప ది రైస్ పేరుతో డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది.

Shyam Singha Roy Photos: HD Images, Pictures, Stills, First Look Posters of Shyam Singha Roy Movie - FilmiBeat

శ్యామ్ సింగరాయ్: న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాను డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేయ‌బోతున్నారు.

Akhanda (BB3) Cast, Release Date, Budget, Actress Name – BollyTrendz

అఖండ‌: బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా, శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌నున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 10న రిలీజ్ కానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Share post:

Latest