బింబిసార టీజర్ : బాహుబలి రేంజ్ లో అదిరిపోయిన విజువల్ ఎఫెక్ట్స్ ..!

నందమూరి హీరోల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు కళ్యాణ్ రామ్. మొదట్లో కేవలం మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన కళ్యాణ్ రామ్ .. ప్రస్తుతం వరుసగా వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే. హరికృష్ణ తో కలిసి బింబిసార అనే సోషియో ఫాంటసీ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వశిస్ట్ దర్శకత్వం వహించారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదివరకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అందులో కళ్యాణ్ రామ్ వందలమందిని చంపి శవాల గుట్టపై కూర్చున్న తీరు ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఇవాళ ఉదయం విడుదల చేశారు.  టీజర్ లో .. ఒక సమూహం తాలుకు ధైర్యాన్నిఒక ఖడ్గం శాసిస్తే.  కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి బానిసలైతే.. ఇందరి భయాన్ని చూస్తూ ఓ రాజ్యం పొగరుతో మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం. బింబిసారుడి ఏకచ్ఛత్రాధిపత్యం. ..అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమాలో విజువల్స్    అనుకున్నట్టుగానే భారీ స్థాయిలో ఉన్నాయి. బాహుబలి, మగధీర లాగా ఈ  సినిమాను ఒక గ్రాండియర్ గా మలిచారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు. వశిస్ట్ కు ఇది తొలి సినిమా అయినా సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్ కు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభించింది.

కళ్యాణ్ రామ్ తొలిసారిగా ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా డిసెంబర్ 2న అఖండ విడుదల రోజున థియేటర్లలో బింబిసార టీజర్ ను ప్రదర్శించి సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. నందమూరి అభిమానుల్లో బింబిసార సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

Share post:

Latest