రామ్ చ‌ర‌ణ్ మూవీలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌..!?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో త‌న 15వ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Image

అంజలి, సునీల్‌, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో పాల్గొన్న ఇద్ద‌రు కంటెస్టెంట్లు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందుకున్నాడ‌ట‌.

Image

ఇంత‌కీ వారెవ‌రో కాదు.. లోబో, విశ్వ‌. వీరిద్ద‌రూ ఆర్‌సీ 15లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, వీరిద్దరు రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట‌ వైరల్‌గా మారాయి.