బిగ్‌బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో ప‌దో వారం ప్రారంభం అయింది. ఇప్ప‌టికే హౌస్ నుంచి స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌లు ఎలిమినేట్ కాగా.. ఇంకా ప‌ది మందే హౌస్‌లో మిగిలి ఉన్నారు.

Nagarjuna opens up about Bigg Boss Telugu Season 5

వీరిలో ప‌దో వారం అనేక ప‌రిణామాల అనంత‌రం మానస్, సిరి, సన్నీ, యాంక‌ర్ రవి, కాజల్‌లు నామినేట్ అయ్యారు. అయితే ఈ ఐదుగురిలో ఎవ‌రు ఎనిమినేట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి మాన‌స్‌, స‌న్నీ, యాంక‌ర్ ర‌విలు ముగ్గురూ చాలా స్ట్రోంగ్ కంటెస్టెంట్లు. బ‌య‌ట ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

Bigg Boss Telugu 5: Here's what netizens think about the upcoming nomination process in week 10 - Times of India

కాబ‌ట్టి. వీరు ఎలిమినేట్ అయ్యే ప్ర‌స‌క్తే లేదు. సిరి విష‌యానికి వ‌స్తే.. ఆమెకు త‌న ఫ్యాన్స్‌తో పాటుగా ష‌ణ్ముఖ్ ఫ్యాన్స్ సైతం స‌పోర్ట్ చేస్తున్నారు. ఇక మిగిలింది కాజ‌ల్‌.. ఈమెపై మొద‌టి నుంచీ నెగ‌టివ్ టాక్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే ప‌దో వారం కాజ‌ల్ ఎలిమినేట్ అవ్వొచ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Latest