భీమ్లా నాయక్ లో సీనియర్ కామెడీ  హీరో డిఫరెంట్ రోల్..!

November 29, 2021 at 1:37 pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పోతున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా ఆధారంగా రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈగో కలిగిన ఇద్దరు ఆవేశపరుల మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో కొత్త రికార్డులను నమోదు చేసింది. టైటిల్ సాంగ్, లాల భీమ్లా పాటలు కూడా అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో సీనియర్ కమెడియన్ హీరో రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాజేంద్రప్రసాద్ రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన భీమ్లా నాయక్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పటికే మలయాళంలో విజయవంతం కావడం, తెలుగులో ఈ సినిమాకు మాటలు స్క్రిప్టు త్రివిక్రమ్ అందిస్తుండటంతో ఈ మూవీపై అభిమానుల్లో, ట్రేడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

భీమ్లా నాయక్ లో సీనియర్ కామెడీ  హీరో డిఫరెంట్ రోల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts