సినిమా ప్లాప్ అయిందని విజయ్ దేవరకొండ నా ఫోన్ కూడా తీయలేదు.. డిస్ట్రిబ్యూటర్ ఫైర్..!

November 29, 2021 at 1:23 pm

అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి సూపర్ హిట్ల తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. 2020 లో విడుదలైన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు, కె. ఎస్. వల్లభ నిర్మించారు. రూ.35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.కాగా ఈ సినిమాను పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా హీరో విజయ్ దేవరకొండ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘వరల్డ్ ఫేమస్ సినిమా నన్ను ఎంతో బాధించింది. ఈ సినిమా నేను కొన్న రేట్ కి 10 శాతం వసూళ్లు కూడా సాధించలేదు. ఇండస్ట్రీ డిజాస్టర్ గా మిగిలింది. ఎంతో నష్టపోయా. ఫోన్ చేస్తే కనీసం హీరో విజయ్ దేవరకొండ లిఫ్ట్ కూడా చేయలేదు. ఒక్క సినిమా ప్లాప్ అయినంత మాత్రాన మాట్లాడకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎలా.

నాకు ఇవాళ ప్లాప్ వచ్చింది. రేపు హిట్ రావొచ్చు. హీరో జర్నీ చేయాలి కదా..కనీసం మోరల్ సపోర్ట్ ఇవ్వకపోతే ఎలా. మా వల్ల ఒక డిస్ట్రిబ్యూటర్ నష్టపోయారన్న బాధ్యత లేకుంటే ఎలా. నష్టం భర్తీ చేయకపోయినా పర్లేదు. కనీసం మాట్లాడాలి కదా. ఈ సినిమాను కొన్న నేనే కాదు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. విజయ్ అనే కాదు.. ప్రతి శుక్రవారం మాకు ఒక ఎక్స్ పీరియన్స్ మిగులస్తుంటుంది’ అని అభిషేక్ నామా కామెంట్స్ చేశాడు. విజయ్ దేవరకొండ పై అభిషేక్ నామా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

సినిమా ప్లాప్ అయిందని విజయ్ దేవరకొండ నా ఫోన్ కూడా తీయలేదు.. డిస్ట్రిబ్యూటర్ ఫైర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts