సామ్‌కు హాలీవుడ్ మూవీ రావ‌డానికి ఆ హీరోనే కార‌ణ‌మ‌ట‌..తెలుసా?

November 29, 2021 at 12:12 pm

గ‌త కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత‌.. ఇటీవ‌ల భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఒంటరిగానే ఉంటున్న ఈ బ్యూటీ.. కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి న‌చ్చిన సినిమాల‌ను ఒప్పుకుంటూ పోతోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఈ భామ ఏకంగా ఓ హాలీవుడ్ మూవీని ప్ర‌క‌టించింది.

`అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఓ ఇంగ్లీష్ సినిమాలో సమంత మెయిన్ లీడ్ పోషించ‌బోతోంది. ఫిలిప్‌ జాన్‌ అనే హాలీవుడ్ దర్శకుడు తెర‌కెక్కించ‌బోతున్న ఈ చిత్రాన్ని.. `ఓ బేబీ`కి కో ప్రొడ్యూసర్ గా ఉన్న సునీత తాటి నిర్మిస్తున్నారు. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈ సినిమాలో సామ్‌కు అవ‌కాశం ద‌క్క‌డానికి ద‌గ్గ‌బాటి వారి అబ్బాయి, స్టార్ హీరో రానానే కార‌ణ‌మ‌ట‌.

రానాతో నిర్మాత సునీత‌కు మంచి స‌న్నిహిత్యం ఉంది. అందుకే సునీత‌.. ఈ చిత్రంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందో చెప్ప‌మంటూ రానాని సలహా అడిగిందట. దాంతో ఆయ‌న సమంత అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంద‌ని రికమండ్ చేశాడ‌ట‌. ఆ తర్వాత సునీత దర్శకుడు జాన్ ఫిలిప్ తో సంప్ర‌దింపులు జ‌రిపి.. ఆపై సమంతని కలసి కథ వివ‌రించింది.

ఇక క‌థ న‌చ్చ‌డంతో సామ్ వెంట‌నే ఓకే చెప్పింద‌ని తెలుస్తోంది. కాగా, త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ మూవీలో స‌మంత బై-సెక్సువల్‌ అమ్మాయిగా కనిపించబోతోంది. అంటే కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీల ఆకర్షణకు కూడా లోనయ్యే యువతి పాత్ర‌లో సామ్ న‌టించ‌బోతోంది.

సామ్‌కు హాలీవుడ్ మూవీ రావ‌డానికి ఆ హీరోనే కార‌ణ‌మ‌ట‌..తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts