`బంగార్రాజు`పై న‌యా అప్డేట్‌..ఫుల్ ఎగ్జైట్‌గా నాగ్ ఫ్యాన్స్‌!

November 8, 2021 at 7:21 am

టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. కల్యాణ్‌ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా`కు ప్రీక్వెల్‌గా తెర‌కెక్కుతోంది. అలాగే ఈ మూవీలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టిలు హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా..అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

Laddunda Song Teaser - Bangarraju | Akkineni Nagarjuna | Akkineni Naga Chaitanya |Ramya Krishna - YouTube

ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం నుంచి న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ `ల‌డ్డుందా..` టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో `బాబూ తబలా, అబ్బాయి హార్మోనీ.. తానన ననన.. డాంటకు డడనా..` అంటూ ఏదో రాగం అందుకుంటాడు బంగార్రాజు. అది అర్థం గాక‌ ఓ వ్యక్తి రాజుగారు దీని మీనింగ్‌ ఏంటని అడిగాడు.

Laddunda from Bangarraju song to tease

దీనికి బంగార్రాజు ఓ నవ్వు న‌వ్వి.. ` ఓరి బుడ్డోడా..ఇంతకాలం తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు రా? అడగాలి కదా! నేర్పిస్తాను కదా!` అని చెప్పుకొచ్చాడు. ఇక చివ‌రిగా ఫుల్‌ సాంగ్‌ను నవంబర్‌ 9 ఉదయం 9.09 గంటలకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదేమైనా టీజ‌ర్ బ‌ట్టీ చూస్తుంటే.. ఈ పాట అందరినీ కట్టిపడేసేలా కనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే నాగ్ ఫ్యాన్స్ సైతం ఫ‌స్ట్ సింగిల్ కోసం ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.

`బంగార్రాజు`పై న‌యా అప్డేట్‌..ఫుల్ ఎగ్జైట్‌గా నాగ్ ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts