బాల‌య్య టాక్ షో స్ట్రీమింగ్ టైమ్ వ‌చ్చేసింది..ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్‌`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో న‌వంబ‌ర్ 4 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ టాక్ షోకు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మొత్తం 12 ఎపిసోడ్లుగా ఈ షో స్ట్రీమింగ్ కానుండ‌గా.. ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, ఆయ‌న కుమారుడు మంచు విష్ణు, కుమార్తె మంచు ల‌క్ష్మిలు గెస్ట్‌లుగా వ‌చ్చారు.

Image

ఇప్ప‌టికే ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుద‌లై అద్భుత‌మైన రెస్పాన్స్‌ను అందుకుంది. దాంతో ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న త‌రుణంలో.. ఆహా వారు సూప‌ర్ అప్డేట్ ఇచ్చేశారు.

Image

అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే మొదటి ఎపిసోడ్ ఈ రోజు ఉదయం 11.20 నిమిషాలకు స్ట్రీమింగ్ కాబోతోంద‌ని తాజాగా మేకర్స్ ప్రకటించారు. అంటే మంచు ఫ్యామిలీతో నందమూరి నటసింహం చేసే అల్లరిని మ‌రి కొన్ని గంట‌ల్లోనే చూడొచ్చ‌న్న‌మాట‌. మ‌రి ఈ ఎపిసోడ్ అటు నంద‌మూరి, ఇటు మంచు ఫ్యాన్స్‌కి ఏ రేంజ్‌లో పున‌కాలు తెప్పిస్తుందో చూడాలి.

Image

Share post:

Latest