బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్…!

ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే టాక్ షో చక్కటి రెస్పాన్స్ పొందుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్‌ ప్రోగ్రామ్ ప్రజలను బాగా ఆకట్టుకుంది. మొదటి ఎపిసోడ్‌లో మోహన్ బాబు, రెండో ఎపిసోడ్‌లో నేచురల్ స్టార్ నాని సందడి చేశారు. మూడో ఎపిసోడ్‌లో ఎవరు విచ్చేయనున్నారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మూడో ఎపిసోడ్ అప్పుడిప్పుడే రాదు అని తెలుస్తోంది. ఇప్పటికే మూడవ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కావాల్సి ఉంది కానీ అలా జరగలేదు. అందుకు కారణం తాజాగా బాలకృష్ణ ఒక చిన్న సర్జరీ చేయించుకోవడమే అని తెలుస్తోంది.

ఈసారి విజయ్ దేవరకొండతో సహా ఇద్దరు ప్రముఖ దర్శకులు షోలో అతిథులుగా రానున్నారని సమాచారం. ప్రస్తుతానికైతే విజయ్ లైగర్ షూటింగ్ తో విదేశాల్లో బిజీగా ఉన్నారు. అతని షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగానే తిరిగి స్వదేశానికి విచ్చేసి అన్‌స్టాపబుల్‌ షోలో పాల్గొనే అవకాశం ఉంది. 3 ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందో చూడాలి.

Share post:

Latest