మోహ‌న్ బాబు ఇంట తీవ్ర విషాదం.. ఏం జ‌రిగిందంటే?

November 17, 2021 at 7:22 pm

సీనియ‌ర్ హీరో, టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న సోదరుడు రంగస్వామి నాయుడు మృతి చెందారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. గుండె పోటుతో తిరుప‌తిలోని ఓ ప్రైవేట్ హాస్ప‌ట‌ల్‌లో అడ్మిట్ అయిన రంగ‌స్వామి నాయుడు.. చికిత్స పొందుతూ అక్క‌డే తుది శ్వాస విడిచిన‌ట్టు తెలుస్తోంది.

దీంతో రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఇక గురువారం తిరుపతిలో ఆయ‌న‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, తిరుప‌తిలో వ్య‌వ‌సాయం చేసే రంగ‌స్వామి.. మ‌రోవైపు మోహ‌న్ బాబు చేసే సేవా కార్య‌క్ర‌మాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉంటార‌ని స‌మాచారం.

మోహ‌న్ బాబు ఇంట తీవ్ర విషాదం.. ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts