బిగ్‌బాస్ 5లో యాంక‌ర్‌ ర‌వి సంపాద‌న తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు?!

November 29, 2021 at 7:42 am

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరువ‌వుతోంది. మొత్తం 19 మందితో గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్ హ‌మీద‌, శ్వేత వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, యానీ మాస్ట‌ర్ వ‌ర‌స‌గా ఎలిమినేట్‌ అవ్వ‌గా.. 12 వారం ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా యాంక‌ర్ ర‌వి బ్యాగ్‌ స‌ద్దేశాడు,

టాప్‌ 3లో ఉంటాడనుకున్న ర‌వి కనీసం టాప్‌ 5లోకి కూడా రాకముందే ఎలిమినేట్ అవ్వ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ జీర్ణించుకోలేక‌.. సోష‌ల్ మీడియా వేదిక‌గా బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రియాంక సింగ్‌, కాజల్‌, సిరి కంటే కూడా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న రవికే తక్కువ ఓట్లు ఎలా వస్తాయని నిలదీస్తున్నారు.

ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. బిగ్ బాస్ హౌస్‌లో 12 వారాలు ఉన్న ర‌వి.. ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించాడు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. వారానికి గానూ ర‌వికి రూ. 5 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో ఇస్తున్నారట. ఈ లెక్క‌న యాంక‌ర్ ర‌వి 12 వారాల‌కు రూ.60 ల‌క్ష‌ల‌కు పైగానే రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నాడ‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాగా, ర‌వి రెమ్యూన‌రేష‌న్ బిగ్‌బాస్‌ విజేతకు అందించే 50 లక్షల ప్రైజ్‌మనీ కన్నా ఎక్కువ కావడం గమనార్హం. అంతేకాదు, బిగ్ బాస్ సీజ‌న్ 5లో అత్య‌ధిక పారితోషకం పుచ్చుకుంటున్న‌ కంటెస్టెంట్ కూడా ర‌వినే అని స‌మాచారం.

 

బిగ్‌బాస్ 5లో యాంక‌ర్‌ ర‌వి సంపాద‌న తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts