బంగార్రాజుగా నాగచైతన్య అదిరిపోయాడు.. టీజర్ ఎలావుందంటే..!

November 23, 2021 at 11:21 am

నాగార్జున హీరోగా నటించి ఐదేళ్ల కిందట విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సంచలన విజయం సాధించింది. వరుస ఫ్లాప్ లలో ఉన్న నాగార్జున కు ఈ సినిమా బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సోషియో ఫాంటసీ గా కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున తో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా నాగచైతన్య కు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది.

అయితే ఈ సినిమాలో నాగచైతన్య యువ బంగార్రాజు గా నటిస్తున్నాడు. ఇవాళ నాగచైతన్య బర్త్ డే సందర్భంగా బంగార్రాజు టీజర్ విడుదల చేశారు. ఇందులో యువ బంగార్రాజుగా నాగచైతన్య అదిరిపోయే లుక్ లో కనిపించారు. మాస్ లుక్ లో చైతూ ఆకట్టుకున్నాడు. సోగ్గాడే లో నాన్న స్టైల్ అనుకరిస్తూ అచ్చం అలాగే లుక్ దింపేశాడు.

బంగార్రాజు మూవీ సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ అని ప్రకటించినప్పటికీ ఈ సినిమా కథ ప్రీక్వెల్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో బంగార్రాజు వివాహం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో.. బంగార్రాజు చనిపోవడం.. తదితర అంశాలను చూపించనున్నారు. యువ రమ్యకృష్ణగా కృతి శెట్టి కనిపించనుంది.బంగార్రాజు సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

బంగార్రాజుగా నాగచైతన్య అదిరిపోయాడు.. టీజర్ ఎలావుందంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts