బాల‌య్య‌తో 7 అట్టర్ ప్లాప్ చిత్రాలు తీసిన బ‌డా డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహిం నంద‌మూరి బాల‌కృష్ణ త‌న ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎంద‌రో ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేశారు. కానీ, ఒకే ఒక్క ద‌ర్శ‌కుడు మాత్రం ఆయ‌న‌కు అస్స‌లు క‌లిసిరాలేదు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు. దర్శకుడిగా ఎవరెస్ట్ స్దాయికి వెళ్లిన ఈయ‌న ఎంద‌రో హీరోల‌కు స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కేలా చేశారు. కానీ, ఒక్క‌టంటే ఒక్క హిట్టు కూడా ఇవ్వ‌లేక‌పోయారు.

బాలకృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

బాల‌య్య‌, కె. రాఘ‌వేంద్ర‌రావు కాంబోలో ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా చిత్రాలు వ‌చ్చాయి. అయితే అనూహ్యంగా ఈ చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. కే.రాఘవేంద్ర రావు బాలకృష్ణ కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’. ఈ చిత్రంలో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఫెయిల్ అయింది.

Description - Rowdy Ramudu Konte Krishnudu Telugu DVD

ఆ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో పట్టాభిషేకం, అపూర్వ సహోదరులు, సాహస సామ్రాట్, దొంగ రాముడు, అశ్వమేథం చిత్రాలు రాగా.. ఇవ‌న్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో వీరి కాంబినేష‌న్ సినిమాలను నిర్మించాలంటేనే అప్ప‌ట్లో నిర్మాతలు తెగ‌ భ‌య‌ప‌డిపోయేవారు.

 బాలకృష్ణ, కే.రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన ఏడో చిత్రం ‘పాండురంగడు’. దర్శకేంద్రుడు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పాండురంగడు’లో భగవంతుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు బాలయ్య. అప్పటి ఎన్టీఆర్ నటించిన ‘పాండురంగ మహత్యం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది. (Youtube/Credit)

అయితే దాదాపు ప‌దిహేనేళ్లు గ్యాప్ త‌ర్వాత బాలకృష్ణతో రాఘవేంద్ర రావు తెర‌కెక్కించిన ఏడో చిత్రం ‘పాండురంగడు’. అప్పటి ఎన్టీఆర్ నటించిన ‘పాండురంగ మహత్యం’ సినిమాకు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌ప‌డింది. ఇక ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య‌, రాఘవేంద్ర రావులు క‌లిసి మ‌రో సినిమా చేయ‌లేదు.