సీనియర్ స్టార్ నటుడు కృష్ణంరాజు సోదరుడి కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రభాస్ `ఈశ్వర్` మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా నటన పరంగా ప్రభాస్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వర్షం సినిమాతో ఫస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్.. అడవి రాముడు, చక్రం, ఛత్రపతి ఇలా వరుస హిట్లను ఖాతాలో వేసుకుని స్టార్ హీరోల చెంత చేరిపోయాడు.
ఇక తెలుగు వారి గుండెల్లో డార్లింగ్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయన.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన `బాహుబలి` చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. రాజమౌళిపై నమ్మకంతో ఈ సినిమాకు ఏకంగా ఐదేళ్లు కేటాయించి భారీ సాహసం చేసిన ప్రభాస్‌కి.. అందుకు తగ్గా ఫలితమే దక్కింది.
ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ప్రభాస్.. అసలు హీరో కాకపోయుండే ఏమయ్యేవాడో తెలుసా..? రెస్టారెంట్ బిజినెస్ చేసుకునే వాడట. ఈ విషయాన్ని ఎవరో కాదు.. ఆయనే గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. `ఉద్యోగాలు చేసేంత ఓపిక నాకు లేదు.. అయితే హైదరాబాద్‌లో ఉత్తరాధి ఆహారాలకు చాలా డిమాండ్ ఉంది. అందుకే హీరో కాకపోయుంటే రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసేవాడ్ని` అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా, ఎంత ఎదిగినా ఒదిగే ఉండటం ప్రభాస్ నైజం. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ.. సెట్స్‌లో అందరితోనూ ఈయన చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అందుకే ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్‌ను అందరూ ఇష్టపడతారు. అలాగే ఈయన మంచి ఆహార ప్రియుడు. అయితే రకరకాల ఆహారాలు తాను తినడమే కాదు.. తోటి నటులుకూ రుచి చూపిస్తుంటాడు. ఈ విషయంలోనూ ప్రభాస్‌ను చాలా మంది లైక్ చేస్తుంటారు.