ఎఫ్ -3 విడుదలయ్యేది సంక్రాంతికేనా? క్లారిటీ ఇచ్చిన వెంకీ..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన సినిమా ఎఫ్ -2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ -3 సినిమాను అదే కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఎఫ్ -3 సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుందని గతంలో ఈ సినిమా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తాజాగా తప్పుకుంది. సంక్రాంతి సందర్భంగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ వంటి భారీ చిత్రాలు విడుదలవుతున్నాయి. దీంతో ఎఫ్ -3 సినిమా విడుదలను మేకర్స్ వాయిదా వేశారు.

తాజాగా ఈ విషయమై విక్టరీ వెంకటేష్ క్లారిటీ ఇచ్చారు. ఎఫ్ -3 సినిమా సమ్మర్ కానుకగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపాడు. ఎఫ్ -3 సినిమా రేసు నుంచి తప్పుకోవడంతో సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న సినిమాలపై ఒక క్లారిటీ వచ్చింది. కాగా వెంకటేష్ హీరోగా నటిస్తున్న మరో సినిమా దృశ్యం -2. దృశ్యం సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ పూర్తయి చాలా రోజులు గడిచినప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఈ మూవీ ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్టుగా విడుదల కానుంది.

Share post:

Latest