`ఆహా`లో బాల‌య్య షోకు బ్రేక్‌..? క్లారిటీ ఇచ్చేసిన మేక‌ర్స్‌!

November 22, 2021 at 8:34 am

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో ఓ షో న‌వంబ‌ర్ 4న అట్ట‌హాసంగా ప్రారంభం అయింది. తొలి ఎసిసోడ్‌లో టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఫ్యామిలీ రాగా.. రెండో ఎపిసోడ్‌లో న్యాచుర‌ల్ నాని వ‌చ్చి బాల‌య్యతో క‌లిసి ఓ రేంజ్‌లో సంద‌డి చేశాడు.

Nandamuri Balakrishna's talk show Unstoppable with NBK to premiere on Nov  4, watch video | Entertainment News,The Indian Express

ఈ రెండు ఎపిసోడ్లూ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ షో ప్రారంభం కావడానికి ముందు ఎన్నో సందేహాలు , ప్రశ్నలు వ్యక్తం అయినప్పటికీ బాలయ్య తన హోస్టింగ్ తో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేశారు. పైగా ఇతర షోలతో పోలిస్తే, బాలయ్య షో ఆహాకు బాగా క‌లిసొచ్చింది. ఈ షో స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచీ ఆహాకు స‌బ్ స్క్రైబ‌ర్లు భారీగా పెరిగి పోతున్నారు.

Unstoppable with NBK: aha premieres the first episode featuring the Manchu  family

అయితే ఇలాంటి త‌రుణంలో అన్ స్టాప‌బుల్ కి బ్రేక్ పడింది. ఆహా వారు అన్ స్టాప‌బుల్ ఎపిసోడ్ల‌ను వారానికి ఒక‌టి చ‌ప్పున విడుద‌ల చేస్తుండ‌గా.. గ‌త రెండు వారాలుగా స్ట్రీమ్ అయిన రెండు ఎపిసోడ్లూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. కానీ, మూడో వారం మూడో ఎపిసోడ్ విడుద‌ల కాకపోవడంతో ప్రతి ఒక్కరిలో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Unstoppable with NBK Episode 2 Download Movierulz Nani full episode aha |  cema5

ఈ షో ఇక్కడికి ఆగిపోతుందని మరికొంతమంది అనగా.. లేదు బాలయ్య సర్జరీ చేయించుకున్నారు కదా.. అందుకే నిలిపివేశార‌ని మరికొంత మంది చెబుతున్నారు. అయితే తాజాగా ఈ విష‌యంపై ఆహా మేక‌ర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. `అనివార్య పరిస్థితుల కారణంగా ఈ వారం ఎపిసోడ్‌ను విడుదల చేయలేదు. కానీ త్వరలోనే గట్టిగా రాబోతున్నాము’ అంటూ ఓ వీడియో ద్వారా తెలియ‌జేశారు.

`ఆహా`లో బాల‌య్య షోకు బ్రేక్‌..? క్లారిటీ ఇచ్చేసిన మేక‌ర్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts