ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కాచుకోండి..26న మరో సర్ప్రైజ్.. ఏంటంటే..!

November 22, 2021 at 7:47 pm

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమైన సమయంలో చాలా రోజుల పాటు ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లు వచ్చేవి కాదు. ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎన్టీఆర్, చరణ్ అభిమానులు కళ్ళకు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. దానికి తోడు సినిమా షూటింగ్ కూడా మూడేళ్ల పాటు సాగింది. అయితే ఇప్పుడు సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆర్ఆర్ఆర్ నుంచి రెండు రోజులకు ఒక ఏదో ఒక సర్ప్రైజ్ వస్తూనే ఉంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు టీజర్లు, రెండు పాటలు విడుదలై అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.తాజాగా ఈ సినిమా నుంచి ఈనెల 26వ తేదీన ఒక అప్డేట్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. జనని అంటూ సాగే సోలో అంథమ్ ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7వ తేదీ సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో సినిమాపై అటు ప్రేక్షకుల్లో,ఇటు ట్రేడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు తెలుగు నాట భారీ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి హీరోలుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కాచుకోండి..26న మరో సర్ప్రైజ్.. ఏంటంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts