మ్యాచ్‌కు ముందు సెక్స్.. సీక్రేట్స్ బయటపెట్టిన మైక్ టైసన్ బాడీగార్డ్..

November 22, 2021 at 7:42 pm

మైక్‌ టైసన్‌ బాక్సింగ్ గురించి తెలిసిన వారికి ప్రత్యేకంగా ఈ పేరుని పరిచయం చేయాల్సిన వసరం లేదు. బాక్సింగ్ రంగంలో మైక్‌ టైసన్‌ సృష్టించిన రికార్డ్స్ ఎవ్వరూ అందుకోలేనివి. టైసన్ రింగ్ లోకి దిగితే ప్రత్యర్థుల గుండెలు జారిపోయేవి. ఇందుకే మైక్ టైసన్ ని బాక్సింగ్ లెజండ్ గా అభివర్ణిస్తుంటారు. కానీ.., ఇప్పుడు ఈ దిగ్గజ ఆటగాడు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ సినిమాలో ఈయన కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో.. ఇప్పుడు టైసన్ కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి.


బాక్సింగ్ రింగ్ లోకి దిగే ముందు ఆటగాళ్లు ప్రత్యర్థులను ఎలా చిత్తు చేయాలని ఆలోచిస్తారు. లేదా.. ప్రత్యర్థి నుండి తనని తాను ఎలా కాపాడుకోవాలని టెన్షన్ పడతాడు. కానీ.., బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ ప్రత్యర్థికి ఏమి కాకూడదు అని కోరుకునేవాడట. దీనికి కారణం లేకపోలేదు. టైసన్ తో మ్యాచ్ అంటే ప్రత్యర్థి ఆటగాళ్లు ప్రాణాలతో బయట పడతారు అన్న గ్యారంటీ ఉండేది కాదు. టైసన్ దెబ్బలకి చాలా మంది ఆటగాళ్లు రింగ్ లోనే కోమాలోకి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆటగాళ్ల చేతులు, కాళ్ళు విరిగిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ కారణంగానే టైసన్ తన ప్రత్యర్థి ఆటగాళ్లకి ఏమి కాకూడదని కోరుకునేవాడట. ఇందుకోసం టైసన్ ఓ ట్రిక్ కూడా ఫాలో అయ్యేవాడట.

టైసన్ మ్యాచ్‌కు ముందు తనలోని ఆవేశాన్ని, దూకుడును తగ్గించుకునేందుకు శృంగారంలో పాల్గొనేవాడట. తన ఆవేశాన్ని తగ్గించుకునేందుకు.. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఒకరు కాదు.. చాలా మంది అమ్మాయిలతో సెక్స్ చేసేవాడట టైసన్. ఈ విషయాన్ని స్వయంగా టైసన్ బాడీ గార్డ్ రూడీ బయట పెట్టడం విశేషం. తన బాక్సింగ్ కెరీర్‌లో 58 మ్యాచులు ఆడిన మైక్ టైసన్.. ఏకంగా 50 విజయాలు అందుకున్నాడు. ఇందులో రెండు మ్యాచ్ లు క్యాన్సిల్ అయ్యాయి. అంటే టైసన్ తన జీవిత కాలంలో కేవలం 6 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయాడు. ఇందులో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే టైసన్ తన మొదటి 37 మ్యాచ్ లలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ లెక్కన టైసన్ కిక్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి.. ఇంత పవర్ ఫుల్ ఆటగాడు లైగర్ సినిమాకి కీలకం కాబోతున్నాడు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మ్యాచ్‌కు ముందు సెక్స్.. సీక్రేట్స్ బయటపెట్టిన మైక్ టైసన్ బాడీగార్డ్..
0 votes, 0.00 avg. rating (0% score)