బిగ్‌బాస్ 5: ఎలిమినేష‌న్‌లో బిగ్ ట్విస్ట్‌.. నేడు బ్యాగ్ స‌ద్దేసేది ఎవ‌రంటే?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడోవారం ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్ర‌స్తుతం 13 మందే ఉండ‌గా వారిలో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఏడో వారం నామినేష‌న్స్‌లో ఉన్నారు. కాజల్, సిరి, ప్రియ, ఆనీ మాస్టర్, శ్రీరామ్, రవి, జెస్సీ, లోబోలు ఈ వారం నామినేట్ కాగా.. వీరిలో ఒక‌రు నేడు బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నారు.

Bigg Boss Telugu 7 week Elimination..ఏడో వారం మరో మహిళా కంటెస్టెంట్ అవుట్.. అందరూ ఊహించినట్టుగానే | Bigg Boss Telugu 5 Week 7 Elimination: Priya evicted from House - Telugu Filmibeat

అయితే సోమవారం నాటి నామినేషన్స్ ప్రకటించగానే.. ఈ సారి ఆనీ మాస్టర్ ఎలిమినేట్ కావడం పక్కా అనుకున్నారంతా. ఓటింగ్‌లో కూడా ఆనీ మాస్టరే లీస్ట్‌లో నిలిచింది. కానీ, ఇప్పుడు ఎలిమినేష‌న్‌లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఏడో వారం ఎలిమినేట్‌ అయింది ఆనీ కాదు ప్రియ అని స‌మాచారం.

Bigg Boss 5: Priya to be eliminated

ఈరోజు ప్రియ‌నే బిగ్ బాస్ హౌస్ నుంచి వైదొలిగే మరో కంటెస్టెంట్ అని కన్ఫర్మ్ అయ్యింది. బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో స‌న్నీతో ప్రియ ప్రవర్తన చాలామందికి విస్మయాన్ని క‌లిగింది. ఈ గొడ‌వ వ‌ల్ల ఆమె ఇమేజ్ మొత్తం డ్యామేజ్‌ అయింది. పైగా ఆమె గేమింగ్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. అందు వ‌ల్ల‌నే బిగ్‌బాస్ ప్రియ‌ను ఎలిమినేట్ చేసిన‌ట్టు టాక్‌.

Share post:

Latest