వైరల్: క్రికెట్లో మూడు వికెట్లు ఎందుకు ఉంటాయో తెలుసా..?

మనలో ఎక్కువగా క్రికెట్ ను చూస్తూనే ఉంటాం. అలా చూసేటప్పుడు..వికెట్లు 3 ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా గమనించారా. అవి మూడు ఎందుకు ఉన్నాయి, 2 లేదా 4 ఉండొచ్చు కదా, కానీ పాత కాలంలో రెండు వికెట్ల తోనే క్రికెట్ ఆడే వారు. పైన కేవలం ఒక బేల్ మాత్రమే ఉండేది.

ఇక ఈ రెండు వికెట్ల మధ్య ఆరు ఇంచుల గ్యాప్ ఉండేది. కాలం గడిచే కొద్దీ మ్యాచ్ ఆడేటప్పుడు ఆ బాల్ వికెట్ల మధ్య లో నుంచి వెళ్ళిపోయేది. దాంతో బ్యాట్స్మెన్ వికెట్ పడలేదు కాబట్టి నేను అవుట్ కాదు అనే వాడు. కానీ బౌలర్ మాత్రం వికెట్ మధ్యలో నుంచి వెళ్ళింది కాబట్టి అవుట్ అని అనేవారట. ఇలా ఎన్నో గొడవలు జరుగుతూ ఉండడంతో.. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు..1775 సంవత్సరంలో మూడో వికెట్ పెట్టారు.

ఇక అప్పటి నుంచి గొడవలు లేకుండా మ్యాచులు జరగడం జరిగాయి. ఇక అప్పటి నుంచి మూడు వికెట్ల ఆనవాయితీ వచ్చింది.