బాల‌య్య టాక్ షో.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన `ఆహా`!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4 నుండీ ఈ టాక్ షో ప్రారంభం కానుంది. ఇటీవ‌లె ఈ టాక్ షో ప్రోమో చిత్రీకరణ జ‌ర‌గాగా, అందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ‌ సందడి చేశాయి.

Image

ఇక అప్ప‌టి నుంచీ ఈ షో ప్రోమో ఎప్పుడెప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందా అని అభిమానులే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు సైతం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నాయి. అయితే దీనిపై ఆహా మేక‌ర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం 05:10 నిమిషాలకు అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షో ప్రోమో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Actor Balakrishna to lose front portion of Jubilee Hills home as GHMC plans road widening | The News Minute

దాంతో బాల‌య్య‌ను స్క్రీన్‌పై తొలిసారి హోస్ట్‌గా చూసేందుకు అంద‌రూ ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు. కాగా, అల్లు అరవింద్ నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న‌ ఈ షో మొత్తం 12 ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. మ‌రి ఇప్ప‌టికే భారీ అంచ‌నాల‌ను ఏర్ప‌ర్చుకున్న ఈ షో ఎలాంటి ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందో చూడాలి.

Share post:

Latest