ఆ స్టార్ హీరోతో విఫ‌లమైన త‌మ‌న్నా ప్రేమాయ‌ణం..అస‌లేమైందంటే?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2005లో శ్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ‌.. ఇప్ప‌టికీ త‌న హ‌వాను కొన‌సాగిస్తూనే వ‌స్తోంది. వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మ‌రియు టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న త‌మ‌న్నా వ‌య‌సు 31 ఏళ్లు. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. మ‌రోవైపు అభిమానులు త‌మ‌న్నా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

- Advertisement -

Karthi Tamanna | Movie pic, Still picture, Movies

అయితే గ‌తంతో త‌మ‌న్నా త‌మిళ స్టార్ హీరో కార్తీతో ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంద‌ని ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. ఆవారా సినిమా విడుద‌ల స‌మ‌యంలో త‌మ‌న్నా, కార్తీ చేసిన హడావిడి, అలాగే వారి మధ్య ఉన్న అతి చనువు చూసి వీరి మధ్య ఏదో న‌డుస్తోందంటూ తెగ‌ ప్రచారం జరిగింది. అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు అంటూ వార్తలు కూడా వ‌చ్చాయి.

Karthi, Nagarjuna, Tamanna starrer 'Thozha' ('Oopiri') teaser released on Saturday - Todayz News

కానీ, అంత‌లోనే కార్తీకి ఆయ‌న తండ్రి వేరే అమ్మాయిని ఇచ్చి వివాహం చేసేశారు. దాంతో త‌మ‌న్నాను కొడ‌లిగా చేసుకోవ‌డానికి కార్తీ తండ్రి అంగీక‌రించ‌లేద‌ని.. అందు వ‌ల్ల‌నే వారి ప్రేమ విఫ‌ల‌మైందంటూ అప్ప‌ట్లో ప్ర‌చారం జరిగింది. మ‌రి ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో వారికే తెలియాలి.

Share post:

Popular