జెట్ స్పీడ్‌లో ర‌వితేజ‌..అది కూడా షురూ చేసేశార‌ట‌..?!

`క్రాక్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని మ‌ళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చేసిన ర‌వితేజ‌.. వ‌రుస సినిమాల‌తో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాను పూర్తి చేసిన ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా చేస్తున్నారు.

khiladi-Rama Rao on Duty | Latest Telugu Movie Videos

ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే ద‌స‌రా పండ‌గ నాడు త్రినాథ రావు నక్కిన `ధ‌మాకా` టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న‌ట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ‘డబుల్ ఇంపాక్ట్’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Telugu actor ravi teja movie dhamaka first look out on dussehra bhojpuri south ashas - दशहरा पर 'मास महाराजा' रवि तेजा ने किया 'धमाका'! एक्टर की RT69 मूवी का फर्स्ट लुक जारी –

ఇక రేపో మాపో రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, టైటిల్‌ను అలా అనౌన్స్ చేశారో లేదో.. ఇలా షూటింగ్‌ను సైతం షురూ చేసేశాడ‌ట‌ ర‌వితేజ.ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ కూడా పూర్తైంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. ఈ లెక్క‌న రవితేజ స్పీడ్ ఏ రేంజ్ లో ఉందో స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.