కొడుకు హీరోయిన్‌తో చిరంజీవి రొమాన్స్..ఇంత‌కీ ఎవ‌రామె..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. అందులో డైరెక్ట‌ర్ బాబీ చిత్రం కూడా ఒక‌టి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించ‌బోతున్న ఈ చిత్రానికి `వాల్తేర్ వీర్రాజు` అనే టైటిల్ ఖ‌రారు అయిన‌ట్టు తెలుస్తుండ‌గా..దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు.

Chiranjeevi, Bobby join hands for Chiru 154. Mega update on actor's birthday - Movies News

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ అప్డేట్ ఏంటంటే.. ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ శ్రుతిహాస‌న్‌తో చిరంజీవి రొమాన్స్ చేయ‌బోతున్నార‌ట‌. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. డైరెక్ట‌ర్ బాబీ చిరుకు జోడీగా న‌టించాల‌ని శ్రుతిని సంప్ర‌దించాడ‌ట‌.

Shruti Haasan opens up about her hormonal issues: The pain and physical changes aren't easy - Movies News

ఆమెకు త‌న క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేసింద‌ని.. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కాగా, గ‌తంలో శ్రుతి హాస‌న్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌, త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మ‌రియు మేన‌ల్లుడు అల్లు అర్జున్‌ల స‌ర‌స‌న‌ ఆడిపాడిన సంగ‌తి తెలిసిందే.

Share post:

Latest