విడాకుల తర్వాత తొలిసారిగా పోస్ట్ చేసిన సమంత.. భావోద్వేగంతో అలా?

గత కొద్ది రోజులుగా సమంత నాగచైతన్య వ్యవహారం పై సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అదే వార్తలను నిజం చేస్తూ ఈ జంట విడాకులు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ విడాకుల తర్వాత సమంతా ఎప్పుడెప్పుడు స్పందిస్తుందా అని ఎదురు చూశారు. ఇక విడాకులు తర్వాత తొలిసారిగా సమంత ఒక పోస్ట్ ను చేశారు. అక్టోబర్ 8న జరిగే లాక్ మీ ఫ్యాషన్ షో ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఇంస్టాగ్రామ్ లో ఈ పోస్ట్ ను షేర్ చేసింది.

అయితే ఈ పోస్ట్ ఫ్యాషన్ షో కు సంబంధించింది అయినప్పటికీ, అందులో సమంత రాసిన క్యాప్షన్ లో మాత్రం మొలక అర్థం కనిపిస్తోంది.నేడు సమంత,నాగ చైతన్య ల 4 వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా సమంత వైట్ కలర్ డ్రెస్ నైట్ అండ్ పింక్ కలర్ గులాబీ పూలు ధరించి కిందికి చూస్తున్న తన ఫోటోలు షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది. పాత ప్రేమ పాటలు, పర్వతాలు..శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని.

https://www.instagram.com/p/CUtYnBYBhbA/?utm_source=ig_web_copy_link

కొన్ని పోగొట్టుకున్న పాత చిత్రాల పాటలు దొరికినప్పుడు, లోలోపలి బాధను ప్రతిధ్వనించే ఆ ప్రేమ పాటలు, పాత బంగ్లాలు మెట్ల మార్గాలు.. సంధులలో గాలి శబ్దం అంటూ సమంత భావోద్వేగానికి లోనయ్యింది. రేపు జరిగే ఫ్యాషన్ షో కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఈ పోస్టు ద్వారా ఆమె పేర్కొన్నప్పటికీ ఇందులో మరొక అర్థం ఉంది అంటూ నెటిజన్లు అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.