`ఆర్ఆర్ఆర్‌`పై బిగ్ అప్డేట్‌.. విడుద‌ల‌కు డేట్ లాక్‌..?!

October 1, 2021 at 12:28 pm

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం.. రణం.. రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు.

RRR New Poster Out Ram Charan, Jr NTR Enjoy Bike Ride As Film

ఈ పాన్ ఇండియా చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. వాయిదా ప‌డుతూనే వ‌స్తోంది. నిజానికి వ‌చ్చే నెల 13న ఈ చిత్రం విడుద‌ల కావాల్సిన ఉంది. కానీ, కరోనా నేపథ్యంలో ఈ మూవీ మేక‌ర్స్ మ‌ళ్లీ వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై బిగ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Official: RRR Movie OTT Rights with Netflix, Zee 5! "Telugu Movies, Music, Reviews and Latest News"

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ మూవీని వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా మార్చి 31న గ్రాండ్ రిలీజ్ చేయాల‌ని డేట్ లాక్ చేశార‌ట‌. అంతేకాదు, కొత్త విడ‌ద‌ల తేదీని అధికారికంగా త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఆ ప్ర‌క‌ట‌న కోసం అటు మెగా, ఇటు నంద‌మూరి అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా, ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరీస్ లు మీరోయిన్‌గా న‌టుస్తున్నారు.

 

`ఆర్ఆర్ఆర్‌`పై బిగ్ అప్డేట్‌.. విడుద‌ల‌కు డేట్ లాక్‌..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts