ఆర్యన్ ఖాన్ విషయంలో సంచలన ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన విషయం అందరికి తెలిసిందే. ఆర్యన్ తో పాటుగా ఇంకా పలువురిని అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం పై బాలీవుడ్ ప్రముఖులు స్పందించ గా తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంపై స్పందించారు. తండ్రి వర్సిటీలకు మారుపేరుగా నిలిచిన ఆర్జీవి తాజాగా ఆర్యన్ ఖాన్ చేతి విషయంలో వరుసగా సంచలన ట్వీట్ చేస్తున్నాడు.

సూపర్ స్టార్ కొడుకుని సూపర్ డూపర్ స్టార్ గా మార్చినందుకు ఎన్సిబి కి షారుక్ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాలన్నారు.ఎన్సీబీ నిర్మాణ సారథ్యంలో మీడియా డైరెక్షన్ లో ఆర్యన్ ఖాన్ హీరోగా రాకెట్ అనే సినిమా తెరకెక్కుతోంది అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

తన తండ్రి షారుక్ ఖాన్ కన్నా జైలు, ఎన్సీబీ నుంచి చాలా నేర్చుకున్నానంటూ ఆర్యన్ భవిష్యత్ లో చెబుతాడని అన్నారు. మీడియా, ఎన్సీబీ అసాధారణ రీతిలో ఆర్యన్ ఖాన్ ను లాంచ్ చేశాయని చెప్పారు. ఏదైమైనా వర్మ చేస్తున్న ట్విట్స్ షారూఖ్ ఖాన్ కి పుండు మీద కారం జల్లినట్టు ఉందని అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి సోషల్ మీడియాలో వర్మ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest