రాజకీయ ప్రవేశంపై.. కుండబద్దలు కొట్టిన ప్రభాస్..వీడియో వైరల్..!

టాలీవుడ్ టాప్ హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ తన ఏదైనా మాటలు మాట్లాడుతుంటే అలానే వింటూ ఉంటారు అభిమానులు ప్రేక్షకులు.ప్రభాస్ రాజకీయాల విషయంపై ఆయనని ఒక మీడియా సంస్థ అడగగా.. అతడు చెప్పిన సమాధానం విని అక్కడున్న వారందరికీ మతి పోయింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

తన పెద్ద నాన్న కృష్ణం రాజు మొగల్తూరు ఎంపిక చేసినప్పుడు.. తన సహనం అంతా కోల్పోయాం అంటూ తెలియజేశాడు. ఒక నెల రోజుల పాటు మొగల్తూరు బాధ్యతలన్నీ ప్రభాస్ కు అప్పగించారట. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు తమ సమస్యలను, పార్టీలో ఉండే గొడవలను తెలియజేసేవారట. వాళ్లకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు.రాజకీయాలు అసలే తెలియదు. నా వల్ల ఒక్క ఓటు కూడా రాదు. ఒక్క ఓటు కూడా నావల్ల పక్కకు పోకూడదని వారు చెప్పేవన్నీ వింటూ ఉండేవాడిని అని తెలియజేశాడు.

ఇక ఆ తర్వాత తన పెదనాన్న కి దండం పెట్టి.. మీ రాజకీయాలకు నాకు సంబంధం లేదు. జీవితంలో ఇంకొకసారి పిలవద్దు అంటూ తెలియజేశారు. తనకు రాజకీయాలు సెట్టుకావు అంటూ తెలియజేశాడట. జీవితంలో రాజకీయాల వైపు అస్సలు చూడను అని తెలియజేశాడు.

Share post:

Latest