పెద్ద కొండ కంటే.. చిన్న దేవరకొండకే ముందు పెళ్లట..!

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అర్జున్ రెడ్డి సినిమా తోని ఓవర్ నైట్ స్టార్ హీరోగా పేరుపొందాడు విజయ్ దేవరకొండ. ఇక తన తమ్ముడు కూడా ఆనంద్ దేవరకొండ కూడా అందరికీ సుపరిచితమే. అయితే విజయ్ దేవరకొండ వివాహంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

విజయ్ దేవరకొండ ముందుగానే ఆనంద్ దేవరకొండ పెళ్లి అవుతుందని విజయ్ తెలియజేశాడు. అయితే ఇప్పుడే ఈ మాట విజయ్ దేవరకొండ ఎందుకు అన్నాడు అనే విషయం తమ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. విజయ్ దేవరకొండ వివాహం ఎందుకు ఇప్పుడే వద్దు అనుకుంటున్నాడా అనే సందేహం కూడా కలుగుతుంది.

మరికొంతమంది విజయ్ ఇప్పుడు బాగా మంచి సక్సెస్ బాటలో ఉన్నాడు. అందుచేతనే ఇప్పట్లో వివాహం చేసుకొడు అనే వార్త కూడా వినిపిస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఈయన సాధించాల్సిన చాలానే ఉన్నాయని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అందుచేతనే ముందుగా తన తమ్ముని ఒక ఇంటివాడు చేస్తున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరు మాత్రం ప్రస్తుతం నటన పైన దృష్టి పెట్టాడు. అయితే వీరిద్దరూ ఎవరితోనూ ప్రేమలో పడినట్లుగా కూడా వార్తలు రాలేదు.