తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఏడు వారాలు పూర్తి అవ్వగా.. ఏడో వారం ప్రియ ఎలిమినేట్ అయింది. ముందు నుంచి ఓటింగ్ లిస్ట్‌లో టాప్ లో ఉన్న ప్రియ.. ఉన్నట్టుండి బ్యాగ్ సద్దేయడం చాలా మందికి బాధను కలిగించింది. అయితే ఎలిమినేషన్ తర్వాత స్టేజీ మీదకు వచ్చిన ప్రియతో గేమ్ ఆడించాడు నాగ్. హౌస్‌మేట్స్‌కు రిపోర్డ్ కార్డ్ ఇవ్వమని ఆదేశించాడు.
దాంతో ఒక్కో కంటెస్టెంట్ గురించి చెబుతూ.. మార్కులు వేసింది ప్రియ. ఈ క్రమంలోనే షణ్ముఖ్‌తో ఓ ఆట ఆడుకుంది. నీ గర్ల్‌ఫ్రెండ్ దీప్తికి ఏమైనా చెప్పాలా? అని ప్రియ అడగ్గా.. ఆ మాట చాలంటూ తెగ సంతోషించాడు షణ్ను. దాంతో వెంటనే `నిన్ను మర్చిపోయి హౌస్‌లో హాయిగా ఉంటున్నాడని` దీప్తికి చెప్తానని ప్రియ అనడంతోతో వణికిపోయాడు షణ్ను.
అలా చెప్పొద్దంటూ దండం పెట్టేశాడు. మా ఇంట్లో వాళ్లకు కూడా భయపడను, కానీ ఆ అమ్మాయికి భయపడతాను అంటూ షణ్ను చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్‌గా మారాయి. కాగా, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, స్టార్ యూట్యూబర్ దీప్తి సునైనాతో షణ్ముఖ్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నారు.