నిహారిక నిర్మించిన `ఓసీఎఫ్ఎస్` టీజ‌ర్ వ‌చ్చేసింది..!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కుమార్తె నిహారిక కొణిదెల ఇటీవ‌ల నిర్మాత‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆమె నిర్మించిన తాజా వెబ్ సిరీస్ ఓసీఎఫ్ఎస్ అంటే.. `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`. ఈ సిరీస్‌లో సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరోహీరోయిన్లుగా న‌టించ‌గా..మహేశ్ ఉప్పల దర్శకత్వం వ‌హించారు.

Image

అలాగే ఈ సిరీస్‌లో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్‌లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉండ‌నున్నాయి. జీ5 ఓటీటీ వేదికగా ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ ప్రీమియర్స్ నవంబరు 19న ఉండనుంది. ఈ నేప‌థ్యంలోనే న్యాచుర‌ల్ స్టార్ నాని తాజాగా `ఓసీఎఫ్ఎస్` టీజ‌ర్ విడుద‌ల చేశారు.

Image

ఇక టీజ‌ర్‌లో పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేస్తూ ఫ‌న్‌ను క్రియేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తానికి ఎంతో స‌ర‌దాగా సాగిపోయిన ఈ టీజ‌ర్‌.. సిరీస్‌పై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి లేటెందుకు మీరూ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టీజ‌ర్‌పై ఓ లుక్కేసేయండి.

Share post:

Latest