పుష్ప సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్.. ఎవరు నటిస్తున్నారంటే?

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈసినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. ఇక ఈ సినిమాను రెండు పార్ట్స్ గా విడుదల చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. ఇక ఇది ఇలా ఉంటే పుష్పక సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ పుష్ప సినిమాలో సుకుమార్ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం కుమార్ బాలీవుడ్ బ్యూటీ నోరా ఫేతేహిని సంప్రదించాడట. ఈ ఆఫర్ కు ఆ బ్యూటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, అందుకోసం భారీగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క అయిదు నిమిషాల పాట కోసం ఆమె ఏకంగా రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట. ఇక అంత రెమ్యునరేషన్ మన తెలుగులోనే కొందరి హీరోలకు కూడా ఉండదు. ఆమె డిమాండ్ వినోద్కుమార్ మూవీ మేకర్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే గతంలో టెంపర్ సినిమా లో ఐటెం సాంగ్ కోసం ఐదు లక్షలు తీసుకున్న ఆమె ప్రస్తుతం ఈ సినిమా కోసం రెండు కోట్లు అడగడం తో మేకర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఇక అందుకు మూవీ మేకర్స్ ఓకే చేశారా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.