బాల‌య్య ఇంటికెళ్లిన మోహ‌న్‌బాబు, విష్ణు..కార‌ణం అదేనా?

October 14, 2021 at 12:52 pm

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ఎన్నికల్లో మంచు విష్ణు విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మా ఎన్నిక‌లు పూర్తైనా ర‌చ్చ మాత్రం కొన‌సాగుతోంది. విష్ణు విజ‌యం సాధించ‌డంతో.. ప్ర‌కాశ్ రాజ్‌తో స‌హా ఆయ‌న ఫ్యానెల్ స‌భ్యులంద‌రూ మా స‌భ్య‌త్వానికి రాజీనామా చేసేశారు.

ఇదేది పట్టించుకోని మంచు విష్ణు మాత్రం మా అధ్యక్షుడిగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇక తాజాగా విష్ణు తండ్రి మోహ‌న్ బాబుతో క‌లిసి నంద‌మూరి బాల‌కృష్ణ ఇంటికి వెళ్లారు. మా ఎన్నిక‌ల్లో బాల‌య్య మంచు విష్ణుకే మ‌ద్ద‌తు ప‌లికారు. ఈ విష‌యాన్ని ఆయ‌న డైరెక్ట్‌గా చెప్ప‌క‌పోయినా.. మంచు విష్ణు మాత్రం `బాలయ్య మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉంది` అని ఆయ‌న‌తో దిగిన ఫొటోను ఎన్నిక‌ల‌కు ముందు షేర్ చేశారు.

Manchu Vishnu gets Balakrishna's support - TeluguBulletin.com

అయితే ఇప్పుడు అధ్యక్షుడిగా గెలిచిన క్రమంలో తనకు మద్దతుగా నిలిచినందుకుగానూ విష్ణు.. బాలయ్య ఇంటికి వెళ్లి స్వ‌యంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన‌ట్టు సమాచారం. అలాగే ఈ సంద‌ర్భంగా సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై బాలయ్యతో చర్చినట్లు తెలుస్తోంది. ఇక బాలయ్యను కలిసిన అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకునేందుకే వచ్చాను అని స్పష్టం చేశాడు. మొత్తానికి వీరి మీటింగ్ మాత్రం సినీ ఇండ‌స్ట్రీలో కొత్త చ‌ర్చ‌లు దారి తీస్తోంది.

బాల‌య్య ఇంటికెళ్లిన మోహ‌న్‌బాబు, విష్ణు..కార‌ణం అదేనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts