‘మా’ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు..!

October 13, 2021 at 2:03 pm

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మంచు విష్ణు బుధవారం బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 10వ తేదీన మాకు జరిగిన ఎలక్షన్స్ లో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించాడు. 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణు బుధవారం మా కార్యాలయంలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు.

‘ నేను ఇవాళ మా కార్యాలయంలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించాను. నాకు మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్టు కావాలి’ అని ట్వీట్ చేశాడు. కాగా మరోవైపు మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు చెందిన 11 మంది సభ్యులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే మా వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ గెలిచాడు. అయితే వీరందరూ నిన్న మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మంచు విష్ణు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో వీరందరి రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని.. బుజ్జగిస్తాడో లేదంటే ఆస్థానంలో వేరే వాళ్లను భర్తీ చేస్తాడో వేచి చూడాలి. మా ఎన్నికల సందర్భంగా సినీ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలింది. ఒక వర్గం పై మరొక వర్గం దుమ్మెత్తి పోసుకుంటోంది. ఎన్నికల ముగిసినప్పటికీ ఇంకా ఈ వేడి చల్లారలేదు. మరి పరిస్థితులు ఎప్పటికీ సర్దుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.

‘మా’ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts