టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మాకు తెలిసిన విషయమే. అయితే ఆయనకి ఒక అన్న ఉన్నాడనే విషయం అతి తక్కువ మందికి తెలుసు. కానీ ఆయన కూడా ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. ఇక ఈ రోజున మహేష్ బాబు వాళ్ళ అన్న రమేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తన ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాడు మహేష్ బాబు.
రమేష్ బాబు విషయానికి వస్తే నటుడిగా నిర్మాతగా ఆయన తెలుగులో ఎన్నో చిత్రాలలో పనిచేశాడు. నా జీవితం ఇలా ఉండడానికి పెద్ద కారణం మా అన్నయ్య రమేష్ బాబు. మనకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. మా అన్నయ్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. తను ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటూ కోరుకుంటూ ఒక పోస్టును తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు మహేష్ బాబు. ఇప్పుడు ఆ ట్వీట్ ర్ కాస్త వైరల్ గా మారుతుంది. ఇక వాటితో పాటే కృష్ణ మహేష్ బాబు రమేష్ బాబు కలిసి నటించిన సినిమా ఫోటోని షేర్ చేశాడు మహేష్ బాబు.
One of my biggest influences.. he's someone I've always looked up to! 🤗 Wishing my Annaya a very happy birthday!! Health and happiness always. 🤗🤗 pic.twitter.com/Lk21dAC8vK
— Mahesh Babu (@urstrulyMahesh) October 13, 2021